Padmasri Dr Nataraja Ramakrishna Dance Festival Ended on 20th Aug 2012 at Sundaraiah Vignana Kendram
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ముగిసిన డా. నటరాజ రామకృష్ణ నృత్యోత్సవం
ఆంధ్రనాట్యం, పేరిణి కళాకారుల సంస్థ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్యోత్సవం 20 ఆగష్టు 2012న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ముగిసింది.
ఈ ఆంధ్రనాట్యనృత్యోత్సవాలకు కె. జితేంద్రబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రసంగ కార్యక్రమం జరిగింది. డాక్టర్ దుర్గాప్రసాద్ ‘ఆలయ నృత్యాలు ప్రదర్శన’ అనే అంశంపై, ప్రొఫెసర్ జొన్నలగడ్డ అనూరాధ ‘జాయప వృత్త రత్నావళి – దేశీచారుల ప్రదర్శన’ అనే అంశంపై ప్రసంగించారు. నటరాజ రామకృష్ణ పేరిణి తాండవాన్ని కళాకారులు ప్రదర్శించి కన్నులవిందు చేశారు.
నృత్య ప్రదర్శనలలో వేణుగోపాల వర్మ శిష్యులు (ఆంధ్రనాట్యం), హైమావతి (ఒడిస్సీ), ఎ. లక్ష్మీ మంగతాయారు శిష్యులు (ఆంధ్ర నాట్యం గొల్లకలాపం), పేరిణి శ్రీనివాస్ శిష్యులు (ఆంధ్రనాట్యం), టి. భీమన్ శిష్యులు (ఆంధ్రనాట్యం) నృత్యాలు అలరించాయి.
శ్రీరంగం రాఘవ కుమారి, కళాకృష్ణ, సువర్చలాదేవి తదితరులు పాల్గొన్నారు.