Content Text < < < Back to Menu

#8-2-120/86/9, 3rd Floor, Plot # 30, Rao & Raju Colony, Road No. 2, Banjara Hills, Hyderabad- 500034.E-Mail: kuchipudi@siliconandhra.org, Website: www.siliconandhra.org


Silicon Andhra organizing 3rd International Kuchipudi Dance Festivals from 28th to 30th December 2012 

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మూడవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం


తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాషా సాహిత్య వైభవాన్ని పరిరక్షించే కృషిలో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిలికానాంధ్ర డిసెంబర్ 23, 24,25 తేదీల్లో హైదరాబాద్ లో మూడవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన నాందీ ఉత్సవం సెప్టెంబర్ 2న హైదరాబాద్ లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం లో ఘనంగా జరిగింది. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి డా. దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని డిసెంబర్ లో జరిగే విశ్వనర్తన మహోత్సవ విశేషాలతో రూపొందించిన వెబ్ సైట్ ను, గోడ పత్రికను నర్తకీ నర్తకుల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. కూచిపూడి నాట్యాన్ని అభ్యసించిన కళాకారిణిగా, నాట్యమంటే ప్రత్యేక అభిమానం కలిగిన వ్యక్తిగా సిలికానంద్ర తలపెట్టిన మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

 సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ 2008 జూన్ 20, 21, 22 తేదీల్లో అమెరికాలో జరిగిన ప్రథమ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం 2010 డిసెంబర్ 28,29 30 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన ద్వితీయ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నవాని , 2012 డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో జరిగే తృతీయ నాట్య సమ్మేళనం ఆ రికార్డుల్ని అధిగమిస్తుందని, ఈ నాట్య సమ్మేళనాలకు డా. దగ్గుబాటి పురందేశ్వరి గారే గౌరవాధ్యక్షురాలుగా ఉండడం గర్వకారణమని చెప్పాడు.

ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్ సమాచార సలహాదారుగా పనిచేసిన పి.వి.ఆర్.కె. ప్రసాద్, శాంత బయోటెక్ అధ్యక్షులు డా. కె. ఐ. వరప్రసాద్ ఈనాడు జర్నలిజం కళాశాల ప్రధానాచార్యులు ఎం. నాగేశ్వరరావు, ప్రుముఖ నాట్య గురువులు, నర్తకినర్తకులు డా.కె.ఉమారామారావు, మద్దాలి ఉషాగాయత్రి, వేదాంతం రాధేశ్యాం, పసుమర్తి రామాలింగాశాస్త్రి, పసుమర్తి కేశవప్రసాద్, డా. పద్మజారెడ్డి, నిర్మలా విశ్వేశ్వరరావు, భాగవతాల సేతురాం, దీపికారేడ్డి, భరణిశంకర్, వేదాంతం సత్య నరసింహశాస్త్రి, వేదాంతం సిద్దేంద్రవరప్రసాద్, లలితా సింధురి, శ్రుతకీర్తి, ప్రీతీ తాటం భొట్ల, ప్రబృతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలికానాంధ్ర భారతదేశ ప్రధాన కార్యదర్శి డా.జె. చెన్నయ్య స్వాగతం పలికారు.

Content Photo Gallery < < < Back to Menu
Content Youtube Links < < < Back to Menu
No videos